బ్రిటన్ హిందువైన సిద్ధార్థ ఐసిస్ కొత్త జిహాదీ జాన్‌గా..
- May 03, 2016
భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సిద్ధార్థ ధర్ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో సీనియర్ కమాండర్‌గా ఉన్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి. ఐసిస్ ఉగ్రవాదుల చేత చిక్కి, లైంగిక బానిసగా నరకయాతన అనుభవించిన ఓ యువతి తెలిపిన వివరాలను ఉటంకిస్తూ.. కథనాలు వస్తున్నాయి.బ్రిటన్ హిందువైన సిద్ధార్థ ఇస్లాంను స్వీకరించి అబూ రుమయ్సాహ్గా పేరు మార్చుకున్నాడు. బ్రిటన్‌లో తన పైన పలు కేసులు ఉన్నప్పటికీ... పోలీసులకు చిక్కకుండా 2014లో తన భార్య, పిల్లలతో కలిసి సిరియా చేరుకొని ఐసిస్‌లో చేరాడు.కొత్త జీహాదీ జాన్‌గా అతడు పేరొందాడు. ఐసిస్‌లో ప్రస్తుతం అతను సీనియర్ కమాండర్ హోదాలో ఉన్నాడు. కొత్త జిహాదీ జాన్ సిద్దార్థ ధర్.. మంచినీళ్లు తాగినంత సులభంగా మనుషుల గొంతు కోసి చంపే జిహాజీ జాన్‌గా భారతీయ హిందువు వ్యవహరిస్తున్నాడని తేలడం గమనార్హం.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







