విమానం గాలిలో ఉండగానే గుండెపోటుతో ప్రయాణికుడు మృతి
- February 19, 2023
దుబాయ్: దుబాయ్ నుంచి ఢాకా వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ విమానంలో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో విమానాన్ని శనివారం కరాచీకి మళ్లించారు. ఫిబ్రవరి 18న దుబాయ్ నుండి ఢాకాకు వెళ్లే FZ 523 విమానంలో మరణించిన ప్రయాణికుడి కుటుంబానికి ఫ్లైదుబాయ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని ఎయిర్‌లైన్ ప్రతినిధి ప్రకటించారు. ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్‌జెడ్ 523ని స్మార్ట్వింగ్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) విమానాశ్రయం నుండి ఢాకా ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. విమానం గాలిలో ఉండగానే బంగ్లాదేశ్ ప్రయాణీకుడు( 59) గుండెపోటు కారణంగా మరణించాడు. కరాచీలో ల్యాండింగ్ తర్వాత వైద్య బృందాలు పరీక్షించాయని..అంతకుముందే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని తెలపింది. ఈ నెల ప్రారంభంలో సిడ్నీ నుండి దుబాయ్ వెళ్లే ఎమిరేట్స్ విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పెర్త్‌కు మళ్లించిన ఘటన జరిగింది. మరొక సంఘటనలో,ఎయిర్‌లైన్ బ్రస్సెల్-బౌండ్ ఫ్లైట్ మిడ్-ఎయిర్ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇరాక్ నగరమైన ఎర్బిల్కి మళ్లించారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







