ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం
- February 19, 2023
దోహా: ఖతార్ లో చాలా మంది తెలుగు సోదరులు పని లేకుండా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దానికి తొడుగా వారిలో అనారోగ్యం కూడా చాల మందిని భాదిస్తూ ఉండటం, అక్కడున్న పరిస్థితుల్లో హెల్త్ కార్డ్ లేక చాల మంది హాస్పిటల్ కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో వున్నారని తెలుసుకొని ఆంధ్ర కళా వేదిక-ఖతార్ కార్యనిర్వాహక బృందం వారు వెల్లకిన్స్ మెడికల్ సెంటర్ వారితో కలిసి సంయుక్తంగా ఉచిత వైద్య శిబిర సదుపాయం వర్కర్స్ కోసం ఏర్పాటు చేసారు.శుక్రవారం రోజున ఉదయం 7 గం నుండి 12 గం వరకు ప్రత్యేకించి మన తెలుగు వర్కర్స్ కోసం ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించటం జరిగింది.పెద్ద సంఖ్యలో 200 మందికి పైగా తెలుగు కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఆంధ్ర కళా వేదికకు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం నుండి భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ హాజరై కార్మికుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేకించి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని, వెల్కిన్స్ మెడికల్ సెంటర్ యాజమాన్యాన్ని, ఇండియన్ మెడికల్ క్లబ్(IDC) డాక్టర్స్ ని, యునైటెడ్ నర్సస్ అఫ్ ఇండియా-ఖతార్ (UNIQ) నర్సస్ ని, వెయిల్కార్నెల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ని అభినందించారు.
ఈ వైద్య శిబిరానికి ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) జనరల్ సెక్రటరీ- కృష్ణ కుమార్, అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్-కె.ఎస్. ప్రసాద్, ఆంధ్ర కళా వేదిక అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ సత్యనారాయణ మలిరెడ్డి, ప్రముఖ తెలుగు నాయకులు నందిని అబ్బగొని, శ్రీధర్, హరీష్ రెడ్డి, Ch.రవి కిషోర్, సయెద్ రఫీ, చూడామణి కూడా హాజరయ్యి ఇటువంటి ఉదాత్తమైన సామాజిక సహాయ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గాన్ని అభినందించారు.
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవటానికి ముఖ్య కారకులైన టువంటి, AKV ఉపాధ్యక్షులు గొట్టిపాటి రమణ కృషిని ఎంతగానో అభినందించారు. ఈ కార్యక్రమ భారీ విజయంలో భాగమైనందుకు వెల్కిన్స్ మెడికల్ సెంటర్ యాజమాన్యానికి, ఇండియన్ మెడికల్ క్లబ్(IDC) డాక్టర్స్ కి, యునైటెడ్ నర్సస్ అఫ్ ఇండియా-ఖతార్ (UNIQ) నర్సస్ కి, వెయిల్కార్నెల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మరియు మద్దతుదారులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు, ముఖ్యంగా నవయుగ రెసిడెంట్ డైరెక్టర్-సిహెచ్. రవికిషోర్ కి ఈ కార్యక్రమాన్ని సుసాధ్యం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాక ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అందరికీ అల్పాహారాలు ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, కేటి రావు, విబికె మూర్తి, శ్రీసుధ, సాయి రమేష్, SS రావు మరియు సోమరాజు కలిసి చాలా చక్కగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







