‘ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్’ను సందర్శించిన యూఏఈ అధ్యక్షుడు
- February 21, 2023
అబుధాబి: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం అబుధాబిలో జరిగిన ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ (ఐడెక్స్) 16వ ఎడిషన్, ఏడవ నేవల్ డిఫెన్స్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ (నవ్‌డెక్స్)ని సందర్శించారు. రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (అడ్నెక్)లో షేక్ మొహమ్మద్ ఆధ్వర్యంలో ఈ ఐదు రోజుల డిఫెన్స్ ఎగ్జిబిషన్ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. యూఏఈ అధ్యక్షుడు అనేక జాతీయ, అంతర్జాతీయ పెవిలియన్లను సందర్శించారు. తాజా సైనిక ఉత్పత్తులు, పరికరాలు, ప్రదర్శనలో ఉన్న వినూత్న వ్యవస్థలను పరిశీలిస్తూ రక్షణ నిపుణులతో వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూఏఈ ప్రెసిడెంట్ వెంట పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!