ఉద్యోగ ప్రకటనలపై హెచ్చరించిన ఐఎల్‌ఓ ఖతార్

- February 22, 2023 , by Maagulf
ఉద్యోగ ప్రకటనలపై హెచ్చరించిన ఐఎల్‌ఓ ఖతార్

దోహా: అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఖతార్‌లోని తన కార్యాలయంలో ఉపాధి అవకాశాలకు సంబంధించిన మోసపూరిత ప్రకటనలపై హెచ్చరించింది. ప్రస్తుతం తమ వద్ద ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవని, వాట్సాప్ ద్వారా దరఖాస్తులు కోరడం లేదని సంస్థ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లు ILO ఈ-మెయిల్ ఖాతా @ilo.org లేదా ilo.org వెబ్‌సైట్ నుండి ఉద్భవించనట్లయితే వాటిని నమ్మొద్దని సూచించింది. దరఖాస్తు, ఇంటర్వ్యూ, ప్రాసెసింగ్ లేదా శిక్షణ దశలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఏ దశలోనూ ఐఎల్ఓ రుసుములు వసూలు చేయదని, అలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరింది. ఐఎల్ఓ-ఖతార్‌కు సంబంధించిన ఇటువంటి అనుమానాస్పద ప్రకటనలు కనిపిస్తే [email protected] కు లేదా స్థానిక పోలీస్ అధికారులకు నివేదించాలని సంస్థ ప్రజలను అభ్యర్థించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com