నేపాల్ వైద్యుడికి 5వ ఇసా అవార్డును అందజేసిన బహ్రెయిన్ రాజు

- February 22, 2023 , by Maagulf
నేపాల్ వైద్యుడికి 5వ ఇసా అవార్డును అందజేసిన బహ్రెయిన్ రాజు

బహ్రెయిన్: వైద్య రంగంలో విశిష్టసేవలు అందించిన నేపాల్ వైద్య నిపుణుడు డాక్టర్ సందుక్ రూట్‌కు 2021-2022 ఇసా అవార్డును హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రదానం చేశారు. ఇసా కల్చరల్ సెంటర్‌లో అవార్డుల వేడుకను నిర్వహించారు. డాక్టర్ రూట్  కంటిశుక్లం చికిత్సకు కొత్త పద్ధతిని రూపొందించడంతోపాటు తక్కువ ధరకే లెన్స్ లను ఉత్పత్తి చేసి పంపిణీ చేయడంలో విజయం సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అంధత్వ నివారణలో ఇది కీలక ముందడుగా నిపుణులు పేర్కొంటున్నారు.

దివంగత హిస్ మెజెస్టి షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఈ అవార్డును ప్రారంభించారని, మానవాళికి సేవ చేయడంలో అతని గొప్ప పాత్రకు  నివాళి అని దివంగత హిజ్ మెజెస్టి షేక్ ఇసా కృషిని గౌరవించడంలో అవార్డు ప్రాముఖ్యతను హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ సందర్భంగా తెలియజేశారు.

విజేత డాక్టర్ సందుక్ రూట్ సాధించిన విజయాలను హైలైట్ చేసే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం డాక్టర్ రూట్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసిన బహ్రెయిన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వానికి సేవ చేసినందుకు ఈసా అవార్డు ఈ గొప్ప దేశం, దాని ప్రజల నిజమైన విలువను సూచిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నేపాల్ ప్రజల తరపున తాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com