ఉద్యోగ ప్రకటనలపై హెచ్చరించిన ఐఎల్ఓ ఖతార్
- February 22, 2023
దోహా: అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఖతార్‌లోని తన కార్యాలయంలో ఉపాధి అవకాశాలకు సంబంధించిన మోసపూరిత ప్రకటనలపై హెచ్చరించింది. ప్రస్తుతం తమ వద్ద ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవని, వాట్సాప్ ద్వారా దరఖాస్తులు కోరడం లేదని సంస్థ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు ILO ఈ-మెయిల్ ఖాతా @ilo.org లేదా ilo.org వెబ్సైట్ నుండి ఉద్భవించనట్లయితే వాటిని నమ్మొద్దని సూచించింది. దరఖాస్తు, ఇంటర్వ్యూ, ప్రాసెసింగ్ లేదా శిక్షణ దశలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ఏ దశలోనూ ఐఎల్ఓ రుసుములు వసూలు చేయదని, అలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరింది. ఐఎల్ఓ-ఖతార్‌కు సంబంధించిన ఇటువంటి అనుమానాస్పద ప్రకటనలు కనిపిస్తే [email protected] కు లేదా స్థానిక పోలీస్ అధికారులకు నివేదించాలని సంస్థ ప్రజలను అభ్యర్థించింది.
🚨Warning: fake job opportunities at ILO-Qatar pic.twitter.com/6czDw2gabL
— ILO Project Office for the State of Qatar (@ILOQatar) February 21, 2023
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!