ఐరెన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారా.?

- February 22, 2023 , by Maagulf
ఐరెన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారా.?

35 నుంచి 40ల వయసుకు చేరుతున్న మహిళల్లో అత్యధికంగా కనిపిస్తున్న సమస్య ఐరన్ సమస్య. శరీరంలో ఐరన్ తక్కువ కావడంతో, ఎర్ర రక్తకణాలు శాతం తగ్గిపోతుంది. దాంతో ఎక్కడ లేని నీరసం ఆవహిస్తుంది. అరచేతులూ, అరికాళ్లూ చల్లబడిపోతుంటాయ్. ఒళ్లంతా తిమ్మిర్లు.. ఈ లక్షణాలు కనిపిస్తే.. అది ఖచ్చితంగా ఐరన్ డెఫిషియన్సీగానే పరిగణించాలి.

ఈ సమస్య వచ్చిన వెంటనే ముందుగా వైద్యుని సంప్రదించడం సూచించిన మందులు వాడడం ఒక ఎత్తు. డైట్‌లో కీలకంగా మార్పులు చేసుకోవడం మరో ఎత్తు.

రాగి జావను డైలీ ఆహారంగా చేసుకోవాలి. క్యారెట్, బీట్‌రూట్‌ని రెగ్యులర్‌గా తింటుండాలి. గ్రీన్ వెజిటెబుల్స్‌ని తరచూ తీసుకుంటుండాలి. నాన్‌వెజ్ తీసుకున్నా, తీసుకోకున్నా అన్ని రకాల పప్పు దినుసులను క్రమం తప్పకుండా తమ డైట్‌లో చేర్చుకోవాలి. ప్రతీ రోజూ ఉడికించిన గుడ్డును తీసుకుంటే మరింత ఎక్కువ ఫలితం వుంటుంది. 
వైద్యులు సూచించిన మెడిసెన్‌తో పాటూ ఈ డైట్ ఫాలో చేస్తే ఐరన్ డెఫిషియన్సీని ఈజీగా అధిగమించొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com