దుబాయ్ నివాసితులకు శుభవార్త.. కుటుంబం, స్నేహితుల కోసం 90 రోజుల విజిట్ వీసా
- February 23, 2023
యూఏఈ: తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఆతిథ్యం ఇవ్వాలనుకునే దుబాయ్ నివాసితులు ఇప్పుడు 3 నెలల విజిట్ వీసాను పొందవచ్చు. ఈ వీసా కోసం హోస్ట్ తిరిగి చెల్లించే డిపాజిట్ Dh1,000 చెల్లించాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. దుబాయ్‌కి చెందిన ఓ కంపెనీకి పీఆర్‌ఓగా పనిచేస్తున్న కేవీ.. తన కంపెనీ ఉద్యోగుల కోసం ఈ వీసాలను దక్కించుకున్నట్లు తెలిపారు. ఇందు కోసం డిపాజిట్ కింద Dh1,000, టైపింగ్ ఛార్జీలు, సర్వీస్ ఫీజు Dh770 అయిందన్నారు. అక్టోబరు 2022లో అడ్వాన్స్‌డ్ వీసా సిస్టమ్‌లో భాగంగా యూఏఈలో ప్రవేశ వీసాలలో విస్తృత సంస్కరణలు చేశారు.
ట్రావెల్ ఏజెన్సీల ప్రకారం.. ఈ వీసాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోలేరని, సిస్టమ్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ వీసాలను పొందగలరని స్మార్ట్ ట్రావెల్స్ కు చెందిన అఫీ అహ్మద్ తెలిపారు.వ్యక్తులు తప్పనిసరిగా GDRFA వెబ్‌సైట్‌లో, యాప్‌లో లేదా అమెర్ టైపింగ్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
GDRFA వెబ్‌సైట్‌లో వినియోగదారులు వ్యాపారం లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఎంట్రీ పర్మిట్‌లు, వారి గ్రీన్ వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంట్రీ పర్మిట్లు, అలాగే పేషెంట్ ఎస్కార్ట్ పర్మిట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధునాతన వీసా సేవలలో భాగంగా కొత్త ప్రవేశ అనుమతులను ప్రవేశపెట్టారు. వాటిలో కొన్ని జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ ఎంట్రీ వీసా, ఒకటి బిజినెస్ ఎంట్రీకి, ఐదేళ్ల మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా, ఒకటి వైద్య చికిత్స కోసం, తాత్కాలిక పని కోసం, చదువులు, శిక్షణ కోసం ఇలా అనేక రకాల వీసాలను యూఏఈ తీసుకొచ్చింది. ICA తన స్మార్ట్ సర్వీస్ సిస్టమ్‌లో ఫిబ్రవరి 1 నాటికి అప్‌డేట్ చేసిన 15 సేవలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం