200 శాతం పెరిగిన విమాన టికెట్ల ధరలు..
- February 23, 2023
కువైట్ సిటీ: ఈ నెల 25 కువైట్ జాతీయ దినోత్సవం సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో నివాసితులు, ప్రవాసులు విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు, టర్కీ, లండన్, కైరో, బీరూట్ తదితర గమ్యస్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో విమాన టికెట్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి. ఏకంగా 200 శాతం మేర విమాన టికెట్ల ధరలు పెరిగినట్లు కువైట్ ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు దేశీయ విమానాలకు కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉందని కువైత్ ఎయిర్‌వేస్ అధికారి షోరఖ్ అల్-అవధి వెల్లడించారు. ప్రయాణీకుల డిమాండ్ మేరకు కొత్త గమ్యస్థానాలకు కొత్త సర్వీసులు సైతం ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …