ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- September 23, 2025
యూఏఈ: దుబాయ్లో బంగారం ధరలు దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తాజాగా గ్రాముకు Dh450 దాటింది. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ డేటా ప్రకారం.. గ్రాముకు 24 కెరట్ గోల్డ్ Dh451.75 కు చేరుకుంది. దుబాయ్లో తొలిసారిగా 21కెరట్ గోల్డ్ ధర గ్రాముకు Dh400 కు చేరుకుంది.
స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.24 శాతం పెరిగి $3,749.32 వద్ద ట్రేడవుతోంది. పెప్పర్స్టోన్లో మార్కెట్ నిపుణులు అహ్మద్ అస్సిరి మాట్లాడుతూ.. బంగారం ఇప్పటికీ అత్యుత్తమ పెట్టుబడి మార్గంగా కొనసాగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తాజా ఘటనల కారణంగా బంగారానికి డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. గోల్డ్ లో పెట్టుబడులను ఇన్వెస్టర్లు సురక్షితమైనవిగా భావిస్తున్నారని తెలిపారు. డారల్ పై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను అధిక మొత్తంలో కొనుగోలు చేయడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణం అని వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …