ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్: భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా
- February 23, 2023
ఆస్ట్రేలియా: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది.సెమీఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది.భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్ కు చేరుకుంది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఓపెనర్లు షఫాలీ శర్మ(9), స్మృతీ మందాన(2), యస్తికా భాటియా(4) విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్ 43(24 బంతుల్లో), హర్మన్ ప్రీత్ 52(34 బంతుల్లో) ఆదుకున్నారు. అయితే చివరలో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఓ దశలో గెలుస్తుందనుకున్న భారత్ ఓటమి పాలైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది.
కాగా ఈ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతంగా ఆడింది. హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లోనే 52 పరుగులు చేసింది. 6 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడి భారత్ ను విజయానికి చేరువ చేసింది. మరికాసేపు ఆమె క్రీజులో ఉండి ఉంటే గెలుపు మనదే అని అంతా అనుకున్నారు. భారత్ విజయానికి 32 బంతుల్లో 39 రన్స్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆమె రనౌట్ అయ్యింది. అంతే, మ్యాచ్ ములుపు తిరిగింది. భారత్ ఓటమి పాలైంది.
కేప్ టౌన్ జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ 54, కెప్టెన్ మెగ్ లానింగ్ 49 (నాటౌట్), ఆష్లే గార్డనర్ 31, అలీసా హీలా 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శిఖా పాండే 2 వికెట్లు తీసింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.
173 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందాన 2, యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 9 పరుగులకే వెనుదిరిగారు. వన్ డౌన్ లో వచ్చిన యస్తికా భాటియా 4 పరుగులు చేసి రనౌట్ అయింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు. కానీ, జట్టుని గెలిపించలేకపోయారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







