మానసిక ఒత్తిడిని తగ్గించే హార్మోన్ స్థాయిని పెంచే మార్గాలివే.!

- February 24, 2023 , by Maagulf
మానసిక ఒత్తిడిని తగ్గించే హార్మోన్ స్థాయిని పెంచే మార్గాలివే.!

ఉరుకుల పరుగుల జీవితంలో అనేక రకాల ఒత్తిడులతో బాధపడుతున్నారు. క్షణం తీరిక లేకుండా రోజును గడపడం.. శరీరానికి తగినంత శారీరక వ్యాయామం లేకపోవడంతో ఒత్తడి వేధిస్తోంది.

ఈ ఒత్తిడి కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు.. నిద్రలేమి వేధిస్తుంటాయ్. దీన్ని అధిగమించాలంటే రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలోనే కొన్ని కీలకమైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

అసలు మానసిక ఒత్తిడిని కంట్రోల్‌లో వుంచేందుకు మన శరీరంలోనే సెరోటోనిన్ అనే ఓ హార్మోన్ వుంటుందని ఎంత మందికి తెలుసు.? ధీన్ని ఫీల్ గుడ్ అండ్ ఫ్రెండ్లీ హార్మోన్‌గా పిలుస్తారు. ఈ హార్మోన్ స్థాయిలు అధికంగా వుంటే, మానసిక ఒత్తిడి నుంచి ఇట్టే ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ హర్మోన్ వుండాల్సిన స్థాయిలో వుండాలంటే ఏం చేయాలి.?
ప్రతీ రోజూ వుడికించిన గుడ్డును తీసుకోవడం వల్ల సెరోటోనిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుందని ఓ సర్వేలో తేలింది. అలాగే చీజ్.. ఇది చాలా రుచికరమైన పదార్ధం.కానీ, కొవ్వు ఎక్కువగా వుంటుందన్న కారణంతో దీన్ని కాస్త దూరం వుంచుతారు. తగిన మోతాదులో చీజ్ తీసుకోవడం వల్ల కూడా సెరోటోనిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుందట. తాజా పైనాపిల్ తీసుకోవడం వల్ల (బాగా పండినది కాదు) కూడా ఫలితం వుంటుంది. అలాగే డ్రై ప్రూట్స్‌కీ ఈ హార్మోన్‌ని పెంచే గుణం ఎక్కువ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com