స్వదేశీ ఆయుధ కంపెనీలతో యూఏఈ $5.7 బిలియన్ల ఒప్పందాలు

- February 25, 2023 , by Maagulf
స్వదేశీ ఆయుధ కంపెనీలతో యూఏఈ $5.7 బిలియన్ల ఒప్పందాలు

బహ్రెయిన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ వారం అబుధాబిలో జరిగిన డిఫెన్స్ ఫెయిర్‌లో స్వదేశీ సంస్థల నుండి బిలియన్ల కొద్దీ ఆయుధాలను కొనేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఇది ఒక రకంగా పాశ్చాత్య సరఫరాదారుల నుండి దూరం జరిగే చర్యగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ రక్షణ ప్రదర్శన (IDEX), నావల్ డిఫెన్స్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ (NAVDEX)లో స్థానిక సంస్థలతో యూఏఈ $5.7 బిలియన్ల విలువైన 44 ఒప్పందాలపై సంతకం చేసింది.  2019లో ఏర్పాటైన కన్సార్టియం అయిన ఎడ్జ్(EDGE)తో సహా దేశీయ సంస్థలకు యూఏఈ ఒప్పందాలు మద్దతుగా నిలువనున్నాయి. 2021లో ద్వైవార్షిక ఆయుధ ప్రదర్శనలో $5.7 బిలియన్లను యూఏఈ ఆయుధాల కోసం ఖర్చు చేసింది.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. యూఏఈ గత దశాబ్దంలో ఆయుధాల దిగుమతులను 40 శాతానికి పైగా తగ్గించింది. యూఏఈ 2012 - 2016 మధ్య అమెరికా ఆయుధాలను కొన్న రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. అయితే 2017 - 2021 మధ్య ఆయుధ దిగుమతులను భారీగా తగ్గించడంతో అమెరికా ఆయుధాలను కొనే దేశాల్లో జాబితాలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. తాజా ఒప్పందాలు యూఏఈ ఆయుధ స్వదేశీకరణకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టమవుతున్నట్లు నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో జీన్-లౌప్ సమన్ అన్నారు.

 

"యుఎఇ తన రక్షణ పరిశ్రమను స్వయం సమృద్ధిని బలోపేతం చేయడానికి ఒక సాధనంగా చూస్తుంది," అని సమన్ వివరించాడు, "పాశ్చాత్య భద్రతా భాగస్వాములపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని" మరియు చమురు నుండి దాని ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచాలని కోరుకుంటున్నట్లు వివరించాడు.

యూఏఈ  ఇప్పుడు 18వ అతిపెద్ద ప్రపంచ ఆయుధాల ఎగుమతిదారు, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, టర్కీ తర్వాత మూడవ అగ్ర సరఫరాదారు దేశంగా ఉంది. 2019లో ప్రపంచ టాప్ 25 అతిపెద్ద ఆయుధ ఉత్పత్తి, సైనిక సేవల కంపెనీల జాబితాలోకి ప్రవేశించిన మొదటి అరబ్ దేశంగా అవతరించింది. అయినప్పటికీ,  తన సైనిక హార్డ్‌వేర్‌లో చాలా వరకు బయటి దేశాల కంపెనీలపై ఆధారపడుతుంది. 2021లో  ఫ్రాన్స్ నుండి 80 రాఫెల్ యుద్ధ విమానాల కోసం సుమారు 17 బిలియన్ యూరోలు ($18 బిలియన్) యూఏఈ ఖర్చు చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com