తీవ్రవాద జాబితాలో ముగ్గురు వ్యక్తులు, సంస్థను చేర్చిన యూఏఈ
- February 25, 2023
యూఏఈ: స్థానిక తీవ్రవాద జాబితాలో కొత్తగా ముగ్గురు వ్యక్తులు, ఓ సంస్థను యూఏఈ చేర్చింది. ఈ మేరకు యూఏఈ కేబినెట్ 2023లో 9వ రిజల్యూషన్‌ను జారీ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు, సంస్థల (స్థానిక తీవ్రవాద జాబితా) ఆమోదించబడిన జాబితాలో 3 వ్యక్తులు మరియు 1 ఎంటిటీని కొత్తగా చేర్చింది. తీవ్రవాదం, దాని సంబంధిత కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేసే నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకోవడం, విచ్ఛిన్నం చేయడం తమ లక్ష్యమని యూఏఈ స్పష్టం చేసింది. రెగ్యులేటరీ అధికారులు అమలులో ఉన్న చట్టాల ప్రకారం 24 గంటలలోపు సంబంధిత వ్యక్తులు, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక తీవ్రవాద జాబితాలో కొత్తగా హసన్ అహ్మద్ మౌకల్లెద్, రాణి హసన్ మౌకల్లెద్, రేయాన్ హసన్ మౌకల్లెద్ అనే వ్యక్తులతోపాటు CTEX ఎక్స్ఛేంజ్ అనే సంస్థను చేర్చారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









