నాని ‘దసరా’ వ్యాపారం వేరే లెవల్.!
- February 25, 2023
నేచురల్ స్టార్ నాని త్వరలో ‘దసరా’ సినిమాతో రాబోతున్నాడు. మార్చి 30న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. నాని నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా సినిమా కూడా ఇది. దాంతో, సినిమాని నెల రోజుల ముందు నుంచే గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు.
ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. దాంతో, నాని కెరీర్లోనే ‘దసరా’ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే, నాని ఇంత హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడాన్ని కొందరు రిస్కీ యవ్వారంగా అభివర్ణిస్తున్నారు.
అందుకు కారణం ఆయన గత చిత్రాల ఫలితాలే. ‘శ్యామ్ సింఘరాయ్’ తప్ప.. ఈ మధ్య నాని కెరీర్లో పెద్దగా హిట్ సినిమాలేం లేవు. చివరిగా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా విషయంలోనూ నాని ఇదే ఓవరాక్షన్ చేశాడు. తీరా రిలీజ్ తర్వాత బొక్క బోర్లా పడ్డాడు. నెటిజన్స్ ట్రోల్‌కి టార్గెట్ అయిపోయాడు. సో, అలా కాకుండా వుండాలంటే, ‘దసరా’ విషయంలో ఇంకాస్త కేర్ ఫుల్‌గా వుంటే మంచిదని ఆయన సన్నిహితులూ, అభిమానులే హెచ్చరిస్తున్నారట.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







