కువైట్ జాతీయ దినోత్సవం: ఆకట్టుకున్న ఎయిర్ షో

- February 26, 2023 , by Maagulf
కువైట్ జాతీయ దినోత్సవం: ఆకట్టుకున్న ఎయిర్ షో

కువైట్: కువైట్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌదీ ఫాల్కన్స్ బృందం నిర్వహించిన ఎయిర్ షో ఆహుతులను విశేషంగా అలంకరించింది. 62వ జాతీయ దినోత్సవం, కువైట్ 32వ విమోచన దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ప్రదర్శనను చూడటానికి కువైట్ టవర్, గ్రీన్ ఐలాండ్ ఏరియా దగ్గరకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కువైట్ ఎయిర్ ఫోర్స్ F18 ఎయిర్‌క్రాఫ్ట్, యూరోఫైటర్ టైఫూన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు 8 BAE హాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడిన "సౌదీ ఫాల్కన్" బృందం అహ్మద్ అల్-జాబర్, సేలం అల్-సబా ఎయిర్ బేస్ నుండి బయలుదేరి ఎయిర్ షోలో పాల్గొన్నాయి. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమం ప్రజలను ఉర్రూతలూగించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com