నేడు అంతరిక్షంలోకి యూఏఈ వ్యోమగామి
- February 27, 2023
యూఏఈ: అంతరిక్ష రంగంలో యూఏఈ చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. మొదటి దీర్ఘ-కాల అరబ్ స్పేస్ మిషన్‌ను ప్రారంభమయ్యేందుకు కొన్ని గంటలు మాత్రమే మిగిలిఉన్నాయి. యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాడి ఈ రోజు ఉదయం 10.45 గంటలకు (యూఏఈ కాలమానం) తన సిబ్బంది ఆరుగురు సహచరులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి 25 గంటల ప్రయాణం కోసం బయలుదేరనున్నారు.
అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం..
డ్రాగన్ ఎండీవర్ తన నలుగురు ప్రయాణీకులను సుమారుగా 28,000kmph వేగంతో స్పేస్ స్టేషన్‌కు తీసుకెళ్లనుంది. ఫిబ్రవరి 28 న సుమారు 2.38am EST (11.38am యూఏఈ సమయం)కి డాక్ చేస్తారు. డాకింగ్ చేసిన తర్వాత ఎక్స్‌పెడిషన్ 69లోని ఏడుగురు సభ్యులను క్రూ-6 సిబ్బంది స్టేషన్లోకి స్వాగతం పలుకుతారు.
కీ మిషన్ స్పెక్స్..
- లిఫ్టాఫ్: ఫిబ్రవరి 27, 10.45am
- బ్యాకప్ అవకాశం: ఫిబ్రవరి 28, 10.22am
- లాంచ్‌ప్యాడ్: లాంచ్ కాంప్లెక్స్ 39A, కెన్నెడీ స్పేస్ సెంటర్
- అంతరిక్ష ప్రయాణ వ్యవధి: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 25 గంటలు
- అంతరిక్ష నౌక: డ్రాగన్ ఎండీవర్
- రాకెట్: ఫాల్కన్ 9
- డాకింగ్: ఫిబ్రవరి 28, 11.38am, స్పేస్ స్టేషన్ హార్మొనీ మాడ్యూల్ స్పేస్-ఫేసింగ్ పోర్ట్‌కి
- మిషన్ వ్యవధి: 6 నెలలు
- ప్రయోగాలు: లైఫ్, ఫిజికల్ సైన్సెస్ వంటి అధునాతన మెటీరియల్స్, టెక్నాలజీ డెవలప్మెంట్, ఇన్-స్పేస్ ప్రొడక్షన్ అప్లికేషన్లు. విద్యార్థుల నేతృత్వంలోని పరిశోధన వంటి రంగాలలో 200కి పైగా సైన్స్ ప్రయోగాలు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









