సౌదీ వాతావరణంలో భారీ మార్పులు.. సివిల్ డిఫెన్స్ హెచ్చరిక

- February 27, 2023 , by Maagulf
సౌదీ వాతావరణంలో భారీ మార్పులు..  సివిల్ డిఫెన్స్ హెచ్చరిక

రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో ఆదివారం నుండి వచ్చే బుధవారం వరకు వాతావరణంలో భారీ హెచ్చుతగ్గులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సివిల్ డిఫెన్స్ పిలుపునిచ్చింది. రియాద్ ప్రాంతంలో రాజధాని, ధర్మా, అల్-అఫ్లాజ్, అల్-ముజాహ్మియా, అల్-ఖర్జ్, హౌతాత్ బని తమీమ్, వాడి అద్-దవాసిర్ మరియు అల్-ఖువైయాతో సహా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా మక్కాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని సివిల్ డిఫెన్స్ తెలిపింది.  

తైఫ్‌తో సహా మక్కాలోని కొన్ని ప్రాంతాలు, అభా మరియు ఖామిస్ ముషైత్‌తో సహా అసిర్ ప్రాంతం, జజాన్, అల్-బహా మరియు నజ్రాన్ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని,  ఇది వరదలకు దారితీయవచ్చని హెచ్చరించింది. అంతేకాకుండా జెద్దా, అల్ లిత్, ఖులైస్ మరియు అల్-కున్‌ఫుదాతో సహా మక్కా ప్రాంతంలో తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది. వర్షపు నీరు నిలువ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, అందులో ఈత కొట్టడం ప్రమాదకరమని సివిల్ డిఫెన్స్ హెచ్చరించింది. ప్రజలు అధికార యంత్రాంగం సూచనలకు కట్టుబడి ఉండాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com