సుప్రీంకోర్టులో మార్చి 28న మూడు రాజధానుల పై విచారణ

- February 27, 2023 , by Maagulf
సుప్రీంకోర్టులో మార్చి 28న మూడు రాజధానుల పై విచారణ

న్యూ ఢిల్లీ: అమరావతే రాష్ట్ర రాజధాని అని ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి కూడా విదితమే. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు విచారణ తేదీని ఖరారు చేస్తూ ఈరోజు కీలక ప్రకటన చేసింది. మార్చి 28న ఈ కేసును విచారిస్తామని తెలిపింది.ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణ తేదీని ఖరారు చేసింది. రాజధానిపై పిటిషన్లను త్వరగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com