టర్కీలో మరోసారి 5.6 తీవ్రతతో భూకంపం.. కుప్పకూలిన మరిన్ని భవనాలు!
- February 27, 2023
యూఏఈ: టర్కీపై ప్రకృతి పగబట్టింది. తాజాగా దక్షిణ టర్కీతో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. మూడు వారాల క్రితం వచ్చిన భారీ భూకంపం పెనువిపత్తును సృష్టించగా.. తాజా వచ్చిన భూ ప్రకంపనల కారణంగా మరిన్ని భవనాలు కూలిపోయాయని ఒక అధికారి తెలిపారు. కాగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని సదరు అధికారి చెప్పారు. తాజా భూకంపం మలత్యా ప్రావిన్స్‌లోని యెసిల్యుర్ట్ పట్టణంలో కేంద్రీకృతమైందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఫిబ్రవరి 6న దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న 11 టర్కిష్ ప్రావిన్సులలో మాలత్య కూడా ఉన్నది. ఆ భూకంపంతో రెండు దేశాలలో 50వేల కంటే ఎక్కువ మరణాలు నమోదు కాగా.. ఒక్క టర్కీలోనే 173,000 భవనాలు కూలిపోవడమో లేదా తీవ్రంగా దెబ్బతినడమో జరిగింది. మరోవైపు ఫిబ్రవరి 6 నుండి భూకంపం ప్రభావిత ప్రాంతంలో దాదాపు 10 వేల కంటే ఎక్కువగా అనంతర ప్రకంపనలు సంభవించాయని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ AFAD తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







