టర్కీలో మరోసారి 5.6 తీవ్రతతో భూకంపం.. కుప్పకూలిన మరిన్ని భవనాలు!

- February 27, 2023 , by Maagulf
టర్కీలో మరోసారి 5.6 తీవ్రతతో భూకంపం.. కుప్పకూలిన మరిన్ని భవనాలు!

యూఏఈ: టర్కీపై ప్రకృతి పగబట్టింది. తాజాగా దక్షిణ టర్కీతో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. మూడు వారాల క్రితం వచ్చిన భారీ భూకంపం పెనువిపత్తును సృష్టించగా.. తాజా వచ్చిన భూ ప్రకంపనల కారణంగా మరిన్ని భవనాలు కూలిపోయాయని ఒక అధికారి తెలిపారు. కాగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని సదరు అధికారి చెప్పారు. తాజా భూకంపం మలత్యా ప్రావిన్స్‌లోని యెసిల్యుర్ట్ పట్టణంలో కేంద్రీకృతమైందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఫిబ్రవరి 6న దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న 11 టర్కిష్ ప్రావిన్సులలో మాలత్య కూడా ఉన్నది. ఆ భూకంపంతో రెండు దేశాలలో 50వేల కంటే ఎక్కువ మరణాలు నమోదు కాగా.. ఒక్క టర్కీలోనే 173,000 భవనాలు కూలిపోవడమో లేదా తీవ్రంగా దెబ్బతినడమో జరిగింది. మరోవైపు ఫిబ్రవరి 6 నుండి భూకంపం ప్రభావిత ప్రాంతంలో దాదాపు 10 వేల కంటే ఎక్కువగా అనంతర ప్రకంపనలు సంభవించాయని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ AFAD తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com