శివమొగ్గ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ
- February 27, 2023
కర్ణాటక: ఈ యేడాది చివర్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సహా బీజేపీ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ఎయిర్పోర్ట్ మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కలల ప్రాజెక్ట్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతుంటాయి.
ఇక శివమొగ్గ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎయిర్‌పోర్ట్‌కు కర్ణాటక కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కువెంపు పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం గంటకు 300 మంది ప్రయాణికులను చేరవేస్తుందని తెలిపారు. శివమొగ్గ విమానాశ్రయాన్ని దాదాపు రూ. 449 కోట్లతో నిర్మించారు. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ భవనం రోజుకు 7,200 మంది ప్రయాణీకులను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.
కాగా, తాజా ఎయిర్‌పోర్ట్‌తో కర్ణాటక రాష్ట్రంలో తొమ్మిది ఎయిర్‌పోర్ట్‌లు అయ్యాయి. బెంగళూరు, బళ్లారి, బెళగావి, కలబురిగి, మైసూరు, మంగళూరు (బెంగళూరు, మంగళూరు నగరాల్లో రెండు ఎయిర్‌పోర్టులు ఉన్నాయి)ల సరసన ఇప్పుడు తాజా ఎయిర్పోర్ట్ చేరింది. ఇక రాష్ట్ర రాజధానిలోని బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత అతిపెద్ద రన్ వే ఉన్న విమానాశ్రయం ఇదే. మరో విశేషం ఏంటంటే, యడియూరప్ప పుట్టినరోజు అయిన ఈరోజే ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యడియూరప్పకు మోదీ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







