డ్రగ్స్ తో పట్టుబడ్డ మోడల్ కు శిక్ష తగ్గింపు
- February 27, 2023
దుబాయ్: మాదకద్రవ్యాలను అభ్యర్థించి, దుర్వినియోగం చేసినట్లు ఒక అరబ్ మోడల్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆమె వాట్సాప్ ద్వారా డీలర్‌ను సంప్రదించి, అతను అడిగిన డబ్బును అతని బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసింది. అనంతరం డ్రగ్స్ తీసుకునేందుకు వెళ్లి పోలీసులకు పట్టబడింది. మాదకద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ పోలీసులు సాయంతో మోడల్‌ను గుర్తించి ఆమె వద్ద నుంచి రెండు రకాల సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆమె చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో మోడల్ పై మాదకద్రవ్యాలను దుర్వినియోగం చేయడం, సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉండటం, సైకోట్రోపిక్ పదార్థాలను కొనుగోలు చేయడానికి డబ్బును బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం వంటి నేరాలను కోర్టు నిర్ధారించింది. అయితే, చేసిన తప్పును ఆమె అంగీకరించడంతో బహిష్కరణ నుండి ఆమె శిక్షను 5,000 దిర్హామ్‌ల జరిమానాకు కోర్టు తగ్గించింది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ నుండి అనుమతి లేకుండా రెండు సంవత్సరాల పాటు డబ్బు బదిలీ చేయకుండా కూడా ఆమెపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







