మార్చి నెలలో బ్యాంకులకు 12 రోజులు హాలిడేస్..
- February 28, 2023
ముంబై: మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూతపడనున్నాయి. హోలీ సహా ఉగాది, శ్రీరామనవమితో పాటు పలు పండుగలు ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. వీక్లీ ఆఫ్‌లు, సాధారణ సెలవు రోజులతో సహా మొత్తం ఈ నెలలో 12రోజులు పాటు బ్యాంకులు మూతపడతాయి. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉండగా, మిగిలినవి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరపుకునే పండుగలు, ప్రత్యేకమైన రోజులను కలుపుకొని సెలవుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాను ఆర్బీఐ వెబ్సైట్లో విడుదల చేసింది.
మార్చి నెలలో బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేకమైన నెలగా చెప్పుకుంటారు. ఎందుకంటే.. మార్చి నెలలోనే ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో పనికూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం మార్చి నెలలో 12రోజులు సెలవులురాగా.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో పాటు మూడు ప్రధాన పండుగల సమయంలో బ్యాంకులు మూతపడనున్నాయి.
మార్చి నెలలో బ్యాంక్ సెలవులు ఏఏ తేదీల్లో అంటే..
- మార్చి 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారం కావడంతో ఈ నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు.
- మార్చి 11, 25 తేదీల్లో రెండవ, నాల్గో శనివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి.
- మార్చి 3(శుక్రవారం) – చుప్‌చార్ కుట్ (త్రిపుర రాజధాని అగర్తలలో సెలవు)
- మార్చి 7 (మంగళవారం)- హోలీ (తెలుగు రాష్ట్రాల్లో సెలవు)
- మార్చి 8 ( బుధవారం) – హోలీ సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవులు
- మార్చి 9 (గురువారం) – హోలీ పాట్నా
- మార్చి 22 (బుధవారం) – ఉగాది పర్వదినం ( తెలుగు రాష్ట్రాల్లో సెలవు)
- మార్చి 30 ( గురువారం) శ్రీరామనవమి (తెలుగు రాష్ట్రాల్లోసెలవు)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







