2022 గ్లోబల్, రీజినల్ ర్యాంకింగ్స్‌: అగ్రస్థానంలో బహ్రెయిన్

- February 28, 2023 , by Maagulf
2022 గ్లోబల్, రీజినల్ ర్యాంకింగ్స్‌: అగ్రస్థానంలో బహ్రెయిన్

బహ్రెయిన్: 2022లో వ్యాపార వాతావరణం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రతిభకు సంబంధించిన అనేక గ్లోబల్ ర్యాంకింగ్‌లు, నివేదికలలో బహ్రెయిన్ అత్యధిక స్కోర్‌ను సాధించింది. ఆర్థిక స్వేచ్ఛ, పెట్టుబడి స్వేచ్ఛ, వాణిజ్య స్వేచ్ఛ (హెరిటేజ్ ఫౌండేషన్ - ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడం 2022), అలాగే ఆర్థిక స్వేచ్ఛ (ది ఫ్రేజర్ ఇన్‌స్టిట్యూట్ - ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2022) కోసం మెనాలో బహ్రెయిన్ మొదటి స్థానంలో నిలిచింది.

బహ్రెయిన్ సమర్థవంతమైన నిబంధనల కోసం (ది ఫ్రేజర్ ఇన్‌స్టిట్యూట్ - ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2022) GCCలో అగ్రస్థానంలో ఉంది.  ఇన్‌ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ ప్రకారం 2021 GDPకి సంబంధించి ఇన్‌వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (FDI) స్టాక్‌ల కోసం GCCలో బహ్రెయిన్ 1వ స్థానంలో నిలిచింది.  ఇది బహ్రెయిన్ GDPలో 85%గా ఉంది. ఇది FDI గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో (FDI ఇంటెలిజెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ టైమ్స్ – గ్రీన్‌ఫీల్డ్ FDI పనితీరు సూచిక నివేదిక 2022) ఉంది.

2022లో బహ్రెయిన్ EDB, టీమ్ బహ్రెయిన్ మద్దతుతో, $1.1 బిలియన్లకు పైగా ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. ఈ పెట్టుబడులు 89 ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌ల నుండి వచ్చాయి. రానున్న మూడు సంవత్సరాలలో స్థానిక మార్కెట్‌లో 6,300 ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ పెట్టుబడులు ఆర్థిక సేవలు, ICT, లాజిస్టిక్స్, తయారీ, పర్యాటకంతో సహా ప్రాధాన్యతా రంగాలపై దృష్టి పెడతాయని నివేదికలో వెల్లడించారు.

2022లో బహ్రెయిన్ సాధించిన విజయాల గురించి వ్యాఖ్యానిస్తూ.. బహ్రెయిన్ EDB స్ట్రాటజీ చీఫ్ నాడా అల్-సయీద్ పలు అంశాలను వెల్లడించారు. బహ్రెయిన్ ర్యాంకింగ్‌లు మా ప్రాంతంలోకి ప్రవేశించాలని చూస్తున్న ప్రపంచ పెట్టుబడిదారులకు దాని ఆకర్షణకు నిదర్శనం అన్నారు. కింగ్‌డమ్ అగ్రస్థానాన్ని చూడటం మాకు సంతోషంగా ఉందని,  ప్రాంతీయ, ప్రపంచ ర్యాంకింగ్‌లు, బహ్రెయిన్ ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళిక క్రింద నిర్దేశించబడిన లక్ష్యాలకు అనుగుణంగా, పోటీ వ్యాపార అనుకూల వాతావరణాన్ని నిర్మించడానికి, దేశంలోకి మరింత ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వాల నిరంతర పురోగతి ఫలితంగా ఏర్పడిందని అల్-సయీద్ పేర్కొన్నారు.

ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళిక కింద ప్రాధాన్యతా రంగాలను అభివృద్ధి చేయడంలో భాగంగా వచ్చిన టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ICT), డిజిటల్ ఎకానమీ సెక్టార్ స్ట్రాటజీ (2022-20260) బహ్రెయిన్ మొత్తం ప్రపంచ స్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాడా అల్-సయీద్ పేర్కొన్నారు.  

వివిధ రంగాలను కొలిచే 56 సూచికలలో మొదటి పది దేశాలలో బహ్రెయిన్ స్థానం పొందిందని ఆర్థిక, జాతీయ ఆర్థిక మంత్రిత్వ శాఖలో పోటీతత్వం & ఆర్థిక సూచికల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డా. ఫైసల్ ఇసా హమ్మద్ తెలిపారు. IMD వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ ఇయర్‌బుక్‌లో బహ్రెయిన్ మొట్టమొదటి ర్యాంకింగ్ ప్రాముఖ్యతను ఆయన వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, నేషనల్ ఎకానమీ గ్లోబల్ రిపోర్టులలో బహ్రెయిన్ ర్యాంకింగ్‌ను నిశితంగా పర్యవేక్షిస్తుందని, సంబంధిత రంగాలలో మెరుగుదల కోసం బలాలు, అవకాశాలను గుర్తించడానికి వివరణాత్మక విశ్లేషణలు, లోతైన అధ్యయనాలను నిర్వహిస్తుందని డాక్టర్ ఫైసల్ ఇసా హమ్మద్ పేర్కొన్నారు.

అదే విధంగా బహ్రెయిన్.. మహిళా డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్, STEM ఎడ్యుకేషన్ ప్లాన్ (ది ఎకనామిస్ట్ ఇంపాక్ట్, మెటా – ది ఇన్‌క్లూసివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2022), డిగ్రీలు ఉన్న మహిళల కేటగిరీలో 3వ స్థానం, నైపుణ్యం కలిగిన కార్మికుల విషయంలో 5వ స్థానం, ఫైనాన్స్ నైపుణ్యాల విషయంలో 7వ స్థానం (IMD వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ ఇయర్‌బుక్ 2022) లో గ్లోబల్ ర్యాంకులను సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com