మాస్ రాజా ‘రావణాసుర’.! కేవలం 40 రోజుల్లోనే.!

- February 28, 2023 , by Maagulf
మాస్ రాజా ‘రావణాసుర’.! కేవలం 40 రోజుల్లోనే.!

మాస్ రాజా రవితేజ జోరు పెంచేశాడు. ఆయన చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులున్నాయ్. అందులో ఒకటి ‘టైగర్ నాగేశ్వరరావు’ కాగా.. ఇంకోటి ‘రావణాసుర’. రెండు సినిమాలూ సెట్స్ పైనే వున్నాయ్.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘రావణాసుర’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే జనవరిలో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. 

దటీజ్ మాస్ రాజా.. మాస్ రాజా మనసు పెడితే ఇట్లుంటది మరి. ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. సొంత బ్యానర్ ఆర్‌టీ అండ్ టీమ్ బ్యానర్‌లో రవితేజ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ ద్వారా అర్ధమవుతోంది. ఆల్రెడీ ప్రమోషన్లు స్టార్ట్ చేసేసిన ‘రావణాసుర’‌లో అక్కినేని సుశాంత్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com