2023 చివరి నాటికి రియాద్ మెట్రో పూర్తి
- March 01, 2023
రియాద్ : రియాద్ మెట్రో ప్రాజెక్టును 2023 చివరిలోగా లేదా 2024 ప్రారంభంలో పూర్తి చేస్తామని రియాద్ మేయర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ అయ్యఫ్ తెలిపారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పష్టం చేశారు. రియాద్ మెట్రో ఇప్పటికే ఉన్న నగరంలో అమలు చేయబడిన అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌గా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. రియాద్ మెట్రో మొత్తం 84 స్టేషన్లతో 6 లైన్లను కలిగి ఉంటుందని ప్రిన్స్ ఫైసల్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో మెట్రో దోహదపడుతుందని, ముఖ్యంగా సౌదీ రాజధానిలో 90% ప్రయాణాలు కార్లపైనే ఆధారపడ్డాయని వివరించారు. రియాద్‌లో పబ్లిక్ పార్కింగ్ ప్లాన్‌కు సంబంధించి, మొదటి దశను ఇటీవల ప్రకటించినట్లు ప్రిన్స్ ఫైసల్ గుర్తుచేశారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో సెంట్రల్ ఏరియాపై దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో రియాద్‌లో పబ్లిక్ పార్కింగ్‌ల ప్రణాళికను అమలు చేస్తామని ప్రిన్స్ ఫైసల్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







