రోడ్డెక్కనున్న ఒలెక్ట్రా ఈ-టిప్పర్లు..

- March 01, 2023 , by Maagulf
రోడ్డెక్కనున్న ఒలెక్ట్రా ఈ-టిప్పర్లు..

విజయవాడ: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (OGL) 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లకు హోమోలోగేషన్ సర్టిఫికెట్ను పొందింది. భారతీయ ఆటో మొబైల్ నియంత్రణ సంస్థల నుంచి ఈ సర్టిఫికెట్ పొందినట్లు సంస్థ వెల్లడించింది. కేంద్రీయ మోటారు వాహన నింబంధనలకు అనుగుణంగా.. ఒలెక్ట్రా 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ రోడ్డుపైకి వ‌చ్చేందుకు అవసరమైన అన్నిఅనుమ‌తులు సాధించింది. ఒలెక్ట్రా త‌యారు చేసిన దేశంలోనే తొలి ఈ-టిప్పర్ మన రహదారులకు అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు, మైనింగ్, క్వారీతో సహా వివిధ ప్రాంతాలలో పరీక్షలు చేసి సర్టిఫికెట్ను జారీ చేశారు. ఒలెక్ట్రా ఈ-టిప్పర్లు హోమోలోగేషన్ సర్టిఫికెట్ పొందిన సందర్భంగా.. ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ. ప్రదీప్ మాట్లాడుతూ.. భారత దేశంలో ఎలక్ట్రిక్ హెవీ వెహికిల్ సెగ్మెంట్ లో ఒలెక్ట్రా ప్రధాన పాత్ర పోషిస్తోందని, తమ సంస్థలో తయారైన ఈ-టిప్పర్ దేశంలోనే మొట్ట మొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ గా నిలిచింది అని చెప్పారు. ఈ-టిప్పర్ ప్రోటో టైపును ఢిల్లీ, బెంగుళూరులో ప్రదర్శించామని.. ఇది ఔత్సాహికులకు గొప్ప ఉత్సుకతను, ఆసక్తిని కలిగించిందని తెలిపారు. 20 ఎలక్ట్రిక్ ఈ-టిప్పర్ల మొదటి ఆర్డర్‌కు సంబంధించి ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తామని ప్రదీప్ తెలిపారు. ఈ-టిప్పర్, ఎలక్ట్రిక్ ట్రక్కుల్లో వివిధ వేరియంట్‌లను కూడా విడుదల చేయబోతున్నామని.. తమ ప్రయాణంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com