యూఏఈ ఎమిరేట్స్ ID రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో మార్పులు

- March 02, 2023 , by Maagulf
యూఏఈ ఎమిరేట్స్ ID రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో మార్పులు

యూఏఈ: యూఏఈలో కొత్త ఎమిరేట్స్ ID రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ప్రవేశపెట్టినట్లు గుర్తింపు, పౌరసత్వం, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ అథారిటీ (ICP) తెలిపింది. దరఖాస్తు ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి అమలు చేస్తున్న మార్పులను అధికార యంత్రాంగం షేర్ చేసింది.

కొత్త ఎమిరేట్స్ ID రిజిస్ట్రేషన్ ఫారమ్ కీలక మార్పులు:

1. ఫారమ్ రీ డిజైన్ చేయబడింది. ICP ప్రకారం.. ఇది అధికార యంత్రాంగం 'విజువల్ ఐడెంటిటీ'కి అనుగుణంగా జరిగింది.

2. దరఖాస్తుదారుల వ్యక్తిగత ఫోటోను ఫారమ్ ఎడమ ఎగువ భాగంలో పెట్టాలి.

3. ఫారమ్ కుడి ఎగువ భాగంలో QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా అప్లికేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.

4. ప్రక్రియలో తదుపరి దశ ఫారమ్ ప్రత్యేక భాగంలో వివరించారు.

5. కార్డ్ డెలివరీ చేయబడే కంపెనీ పేరు ఫారమ్ దిగువ ఎడమ వైపున దాని చిరునామాతో పాటుగా పేర్కొన్నారు.

6. కస్టమర్ వాయిస్ గేట్‌వేని యాక్సెస్ చేయడానికి QR కోడ్ ను యాడ్ చేశారు. ఇది ICPతో ఫిర్యాదులను నమోదు చేసే మెకానిజం.

7. మరొక QR కోడ్ కస్టమర్ ఫింగర్ ఫ్రింట్ అపాయింట్‌మెంట్ తేదీని మార్చడానికి ఏర్పాటు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com