MEIL ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధం

- March 02, 2023 , by Maagulf
MEIL ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధం

హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది.MEIL గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్​ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేస్తోంది.తి.తి.దే మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును గురువారం దేవస్థానముల రవాణా విభాగం జనరల్ మేనేజర్ పి.వీ శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు.ఒలెక్ట్రా తయారు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు అందించాలని MEIL నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ బస్సులను తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు టీటీడి వినియోగించనుంది.TTD అధికారులకు బస్సు పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు వివరించారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు. బస్సుల్లో ఎలెక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తోందో తెలిపే వివరాలు పొందుపరిచారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది, తిరుమల పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపే ఫోటోలను బస్సు పై పొందు పరిచారు.బస్సులో కొద్దిదూరం ప్రయాణించిన శేషారెడ్డి బ‌స్సు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం తో పాటు దేవస్థానం పాలకవర్గం, ఉన్నతాధికారులకు దాని పని తీరును వివరిస్తానని తెలిపారు.MEIL విద్యుత్ బస్సులను అందించటం సంతోషంగా ఉందని, వీటి వల్ల తిరుమల కొండపై కాలుష్య నియంత్రణ జరుగుతుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com