కరివేపాకును లైట్ తీసుకుంటున్నారా.? అయితే మీకీ సంగతి తెలియాల్సిందే.!
- March 04, 2023కరివేపాకు లేకుండా ఏ కూర వుండదు. కానీ, కూరలో కరివేపాకు కనిపిస్తే చాలు తీసి పక్కన పడేస్తుంటాం. కరివేపాకుతో వచ్చే ఆరోగ్య విషయాలు తెలిస్తే ఇకపై కరివేపాకును అస్సలు లైట్ తీసుకోరు.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటూ విటమిన్ సి, ఇ, ఏ పుష్కలంగా వుంటాయ్. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే లక్షణం కూడా కరివేపాకుకు అధికం అట.
కరివేపాకులోని అరోమా నాడీ కణాలను ఉత్తేజపరిచి రోజంగా ఉత్సాహంగా వుండేందుకు తోడ్పడుతుంతి. మూత్రంలో మంట, కిడ్నీ ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా చేస్తుంది.
ప్రతి రోజూ కరివేపాకు కషాయం తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో మెండు అని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఓ నాలుగు కరివేపాకు ఆకులను నీళ్లలో మరిగించి, అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అదీ సంగతి.. కరివేపాకుతో ఆరోగ్యం ఎంతో తెలిసిందా.? ఇకపై కరివేపాకును తీసి పారేయడం మానేసి, కళ్లకు అద్దుకుని తినేయడం అలవాటుగా చేసుకుంటే బావుంటుందిగా మరి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..