మార్చి 7నుంచి ITB 2023: ఒమన్ లో 348 శాతం పెరిగిన పర్యాటకులు

- March 05, 2023 , by Maagulf
మార్చి 7నుంచి ITB 2023: ఒమన్ లో 348 శాతం పెరిగిన పర్యాటకులు

మస్కట్: ఒమన్ సుల్తానేట్ 2023 మార్చి 7 నుండి 9 వరకు జరుగనున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (ITB 2023) లో పాల్గొంటుంది. ఒమానీ ప్రతినిధి బృందానికి హెరిటేజ్, టూరిజం మంత్రి సలీం మహ్మద్ అల్ మహ్రూకీ నాయకత్వం వహిస్తారు. ITB బెర్లిన్ ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక పరిశ్రమ ఫెయిర్. ఇది దేశాలు, పర్యాటక ప్రాంతాలు, టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెంట్లు, బుకింగ్ ఏజెంట్లు, హోటళ్లను ఒకచోట చేర్చుతుంది. ITB బెర్లిన్ 2023లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్ లో దేశంలోని పర్యాటక ఆకర్షణలు, ప్రత్యేకమైన సైట్‌లను ప్రదర్శిస్తుంది. హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT) సహకారంతో సంబంధిత సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయి.  

2022 టూరిజం శాఖ గణాంకాల ప్రకారం.. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ను డిసెంబర్ 2022 చివరి నాటికి దాదాపు 2.9 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. ఇది 2021 అదే కాలంతో పోలిస్తే 348.2 శాతం పెరుగడం గమనార్హం. 2022లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో మొత్తం హోటల్ ఆదాయం OMR186 మిలియన్లకు చేరుకుందని డేటా తెలిపింది. 2021 నుండి 2023 వరకు పర్యాటక రంగంలో ఒమన్ OMR3 బిలియన్లను ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం OMR1.7 బిలియన్ల విలువైన పర్యాటకానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులలో పని జరుగుతోందని ఒమన్ పర్యాటక శాఖ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com