ఇద్దరు సౌదీ మాజీ దౌత్యవేత్తలతో పాటు 13 మంది అరెస్ట్
- March 06, 2023
రియాద్ : బంగ్లాదేశ్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో గతంలో దౌత్యవేత్తలుగా పనిచేసిన ఇద్దరు మాజీ దౌత్యవేత్తలతో పాటు 13 మందిని అవినీతి ఆరోపణలతో అరెస్టు అయ్యారు. అరెస్టయిన వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఎనిమిది మంది ప్రవాసులు, ఒక విదేశీ పెట్టుబడిదారు కూడా ఉన్నారు. పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా), అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన భద్రతా కార్యకలాపాలలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయిన మాజీ దౌత్యవేత్తలలో ఢాకాలోని సౌదీ రాయబార కార్యాలయంలో మాజీ డిప్యూటీ అంబాసిడర్, కాన్సులర్ విభాగం అధిపతి అబ్దుల్లా ఫలాహ్ అల్-షమ్మరీ, ఎంబసీలోని కాన్సులర్ విభాగం డిప్యూటీ హెడ్ ఖలీద్ నాసర్ అల్-ఖహ్తానీ ఉన్నారని నజాహా వెల్లడించింది. వీరు వీసా వ్యాపారంలో నిమగ్నమై ఉన్నకొందరు విదేశీయులతో ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మాజీ దౌత్యవేత్తలు రాయబార కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో రాజ్యంలో వర్క్ వీసాల జారీని పూర్తి చేయడానికి వాయిదాల పద్ధతిలో SR45 మిలియన్లను లంచంగా పొందినట్లు రుజువైందని నజాహా తెలిపింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!