‘క్రౌన్ ప్రిన్స్’కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి
- March 08, 2023
కువైట్: కువైట్‌లో కొత్తగా నియమితులైన భారత రాయబారి హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ డిప్యూటీ అమీర్, క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు తన ఆధారాలను(క్రెడెన్షియల్స్) సమర్పించారు. రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా బయాన్ ప్యాలెస్‌లోని క్రౌన్ ప్రిన్స్ హెచ్హెచ్ని కలిశారు. ఈ సందర్భంగా భారత్-కువైట్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను మరింతముందుకు తీసుకుపోయేందుకు కృషి చేయాలని భారత రాయబారికి , క్రౌన్ ప్రిన్స్ సూచించారు. "భారతదేశం - కువైట్ సాంప్రదాయ భాగస్వాములు. బలమైన చారిత్రక పునాదులపై ఇరు దేశాల మైత్రి నెలకొన్నది. అంబాసిడర్‌గా ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలను కొనసాగిస్తా. " అని రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా చెప్పారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!