బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన నాని.!

- March 09, 2023 , by Maagulf
బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన నాని.!

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వస్తోన్న తాజా మూవీ ‘దసరా’. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాని నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ ఇది. సౌత్ భాషలతో పాటూ, హిందీలోనూ రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం నాని బాలీవుడ్‌పై బాగా ఫోకస్ పెట్టాడు. ముంబయ్‌లో ‘దసరా’ సినిమాని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నాడు నాని. 

ఈ సినిమాలో నాని లుక్స్, గెటప్ ‘పుష్ప’ బ్యాక్ డ్రాప్‌‌ని తలపిస్తోందన్న ప్రచారం కారణంగా ఈ సినిమాపై అక్కడ బజ్ బాగానే వుందనిపిస్తోంది. అలాగే, నాని కూడా ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాడు. 

అలాంటిలాంటి హిట్టు కాదు.. బాక్సాఫీస్ బద్దలుకొట్టే హిట్టవుతుంది ‘దసరా’ అని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. మరి, ఆ అంచనాల్ని ‘దసరా’ అందుకుంటుందో లేదో తెలియాలంటే, మార్చి 31 వరకూ ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com