బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన నాని.!
- March 09, 2023
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబినేషన్లో వస్తోన్న తాజా మూవీ ‘దసరా’. పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాని నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ ఇది. సౌత్ భాషలతో పాటూ, హిందీలోనూ రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం నాని బాలీవుడ్‌పై బాగా ఫోకస్ పెట్టాడు. ముంబయ్‌లో ‘దసరా’ సినిమాని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నాడు నాని.
ఈ సినిమాలో నాని లుక్స్, గెటప్ ‘పుష్ప’ బ్యాక్ డ్రాప్‌ని తలపిస్తోందన్న ప్రచారం కారణంగా ఈ సినిమాపై అక్కడ బజ్ బాగానే వుందనిపిస్తోంది. అలాగే, నాని కూడా ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాడు.
అలాంటిలాంటి హిట్టు కాదు.. బాక్సాఫీస్ బద్దలుకొట్టే హిట్టవుతుంది ‘దసరా’ అని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. మరి, ఆ అంచనాల్ని ‘దసరా’ అందుకుంటుందో లేదో తెలియాలంటే, మార్చి 31 వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు