‘విరాట పర్వం’ కోసం సాయి పల్లవి, ‘దసరా’ కోసం కీర్తి సురేష్.!
- March 09, 2023
మొన్నా మధ్య వచ్చిన ‘విరాట పర్వం’ సినిమాలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించిన అందరి మనసులు కొల్లగొట్టేసింది. ‘వెన్నెల’.. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ వుంది. గతంలోనూ ఈ పేరుపై చాలా లేడీ పాత్రలు రూపుదిద్దుకున్నాయ్.
కాగా, ఇదే పాత్ర పేరుతో ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ రాబోతోంది. అదే ‘దసరా’ సినిమా కోసం. ఇందులో కీర్తి సురేష్ పాత్ర పేరు ‘వెన్నెల’. ఈ వెన్నెల పాత్రను చాలా చక్కగా తీర్చి దిద్దారట ‘దసరా’లో. ఇక, పాత్రలో పరకాయ ప్రవేశం చేసే కీర్తి సురేష్ గురించి ఏం చెప్పేది.? అసలే మహానటి. ఆ పై ప్రాధాన్యత వున్న పాత్రలు దక్కితే చెలరేగిపోదూ.
ఇంతవరకూ రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తుంటే.. ‘దసరా’లో వెన్నెల పాత్ర కీర్తిసురేష్‌కి మరో మంచి మైలురాయి అవుతుందని అంటున్నారు. అన్నట్లు మెగాస్టార్ మూవీ ‘భోళా శంకర్’లోనూ కీర్తి సురేష్ పాత్ర ప్రాథాన్యత సంతరించుకోదగ్గది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







