సమంత ఈజ్ బ్యాక్.! విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఖుషి..!

- March 09, 2023 , by Maagulf
సమంత ఈజ్ బ్యాక్.! విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఖుషి..!

మయోసైటిస్ కారణంగా సమంత కొన్నాళ్లుగా షూటింగ్స్‌కి దూరంగా వున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స నుంచి కోలుకున్నాక, ఈ మధ్యనే సమంత తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే, బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ షెడ్యూల్ పూర్తి చేసింది.

ఇక, తెలుగులో విజయ్ దేవరకొండతో సమంత ‘ఖుషి’ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం సమంత కారణంగానే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందిన్నాళ్లూ, లేటెస్టుగా ఈ సినిమా సెట్స్‌లో సమంత అడుగుపెట్టింది.

విమెన్స్ డే రోజు సమంత ‘ఖుషి’ సెట్స్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా సమంతకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది ‘ఖుషి’ టీమ్. కేక్ కట్ చేయించి విమెన్స్ డే విషెస్ చెప్పడంతో పాటూ, సమంత 13 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు హార్ట్‌ఫుల్‌గా స్పెషల్ వెల్‌కమ్ తెలిపింది ‘ఖుషీ’ అండ్ టీమ్. 

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com