మొటిమలు బాధిస్తుంటే.. ఇలా ట్రై చేసి చూడండి.!

- March 09, 2023 , by Maagulf
మొటిమలు బాధిస్తుంటే.. ఇలా ట్రై చేసి చూడండి.!

మొటిమలు.. పింపుల్స్.. యవ్వనంలో వున్న యువతను బాధించే సమస్యల్లో అత్యంత కీలకంగా చెప్పబడే సమస్య. మొటిమల కారణంగా ముఖ సౌందర్యం కోల్పోవడం ఓ ఎత్తయితే.. వాటి కారణంగా వచ్చే పెయిన్ తట్టుకోలేకపోవడం ఇంకో సమస్య. 
అయితే, మొటిమల కోసం మార్కెట్లో రకరకాల ఫేస్ క్రీములు అందుబాటులో వున్నప్పటికీ.. అవన్నీ తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే.

మన అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పినట్లుగా పసుపుతో మొటిమలకు చెక్ పెట్టడం ఓకే. అయితే, మరికొన్ని సెల్ఫ్ రెమిడీస్ కారణంగా కూడా మొటిమలను తగ్గించుకునే మార్గం వుంది. 

గ్రీన్ టీని బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే, లెమన్ కాంబినేషన్ గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటూ, మొటిమల సమస్య వుండదని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే, వేపలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడడంతో తద్వారా మొటిమల్ని నియంత్రించుకోవచ్చట. నాలుగు లేత వేపాకుల్ని పేస్ట్‌లా చేసుకుని దానిలో కాస్త తేనె వేసి, చిన్న గ్లాస్ వాటర్‌లో కలుపుకుని తాగితే పలితం వుంటుంది. 

ఉసిరి, అల్లం పేస్ట్ మిక్స్ చేసిన గోరు వెచ్చని నీరు తీసుకోవడం వల్ల కూడా మొటిమలకు చెక్ పెట్టొచ్చు. ఈ ద్రావణాలను తీసుకోవడం వల్ల మొటిమలు రాకుండానే, వచ్చిన మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలు కూడా తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే, ఈ ద్రావణాలను తీసుకోవడం వల్ల మొటిమల సమస్య తీరడంతో పాటూ, మంచి ఆరోగ్యం కూడా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com