అగ్ని నక్షత్ర' లోని 'తెలుసా తెలుసా...' పాటను రిలీజ్ చేసిన సమంత

- March 09, 2023 , by Maagulf
అగ్ని నక్షత్ర\' లోని \'తెలుసా తెలుసా...\' పాటను రిలీజ్ చేసిన సమంత

హైదరాబాద్: మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా లోని 'తెలుసా తెలుసా...' పాటను ఉమెన్స్ డే సందర్బంగా  హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్న తో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ మంచు కూడా కనువిందు చేయడం విశేషం. త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటించడం జరుగుతుంది.

ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు.గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తారాగణం :
డా.మంచు మోహన్ బాబు
మంచు లక్ష్మి ప్రసన్న
సిద్దిక్
విశ్వంత్
చైత్ర శుక్ల
తదితరులు...
టెక్నిషియన్స్:
బ్యానర్ -లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌
సంగీతం -అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫీ-గోకుల్ భారతి
ఎడిటర్‌-మధు రెడ్డి
దర్శకత్వం-వంశీ కృష్ణ మళ్ల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com