ఏప్రిల్ 30న నూతన సచివాలయం ప్రారంభం
- March 10, 2023
హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30న కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నూతనంగా నిర్మించిన సచివాలయానికి డా.బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన సిఎం కెసిఆర్ అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభతేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సిఎం కెసిఆర్… త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2 లోపు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







