విశాఖలో 19న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్..
- March 10, 2023
విశాఖపట్నం: ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న విశాఖపట్నంలో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఇది డే అండ్ నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల విక్రయం నేటి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 10, శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
మార్చి 14 నుంచి ఆఫ్‌లైన్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కావాలనుకునే వాళ్లు పేటీఎం యాప్, పేటీఎం ఇన్‌సైడర్ యాప్, ఇన్‌సైడర్.ఇన్ వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు కావాలనుకునే వాళ్లు ఈ నెల 14 నుంచి పీఎం పాలెం క్రికెట్ స్టేడియం-బి, జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణాల్లో కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000గా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే టోర్నీ ఆరంభమవుతుంది. ఇది మూడు వన్డేల సిరీస్. ఇందులో తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 17న జరుగుతుంది. తర్వాత రెండో వన్డే 19న విశాఖపట్నంలో జరుగుతుంది. మూడో వన్డే చెపాక్ స్టేడియంలో జరుగుతుది. విశాఖపట్నంలో చివరిసారిగా వన్డే మ్యాచ్ 2019లో జరిగింది. గత ఏడాది మాత్రం ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







