హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం
- March 11, 2023
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ రోడ్డు తాడ్‌బడ్లోని కూలర్ల తయారీ గోడౌన్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాద విషయం తెలిసి గోడౌన్ యజమాని సంఘటనా స్థలానికి చేరుకొని ఏరియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. సమ్మర్ రావడం తో గోడౌన్ లో పెద్ద ఎత్తున కూలర్లను తయారీ చేస్తున్నారు. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరగడం తో యజమాని లక్షల్లో ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.
కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య నల్లగుట్ట లోని డెక్కన్ షో రూమ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి , ముగ్గుర్ని బలి తీసుకుంది. ఈ ఘటన గురించి చాల రోజుల పాటు నగరవాసులు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కూడా పలు ఏరియాల్లో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







