నకిలీ బంగారు కడ్డీలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

- March 12, 2023 , by Maagulf
నకిలీ బంగారు కడ్డీలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

మస్కట్: నకిలీ బంగారు కడ్డీలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు ROP ఆన్‌లైన్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. నకిలీ బంగారు కడ్డీలను విక్రయించడం ద్వారా మోసం చేశాడనే ఆరోపణలపై మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. అతడిపై చట్టపరమైన చర్యలను పూర్తిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోకేసులో నిర్మాణంలో ఉన్న అనేక ఇళ్లలో ఎలక్ట్రిక్ కేబుల్స్‌ను దొంగిలించారనే ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన నలుగురు నివాసితులను ధోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని, వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com