భక్తులకు అల్పాహారం...

- May 05, 2016 , by Maagulf
భక్తులకు అల్పాహారం...

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. ఇప్పటివరకూ అందిస్తున్న ఉచిత భోజన సదుపాయంతోపాటు అల్పాహారాన్ని కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. వెంగమాంబ నిత్య అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని అందించే పథకానికి టీటీడీ ఈవో సాంబశివరావు శ్రీకారం చుట్టారు. భక్తులకు టిపిన్‌ను పెట్టి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీరోజూ ఉదయం పూట రెండు గంటల పాటు ఈ అల్పాహారాన్ని వడ్డిస్తారు. ఒకేసారి నాలుగు వేల మంది భక్తులకు అల్పాహారం అందించగల సామర్ధ్యం ఉందని ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదం ట్రస్టు కింద మొత్తం 700 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నందుకు భక్తులకు ఉపయోగపడే మరిన్ని సౌకర్యాలపై దృష్టిపెట్టినట్లు సాంబశివరావు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com