వినూత్నంగా ‘విరూపాక్ష’ ప్రమోషన్స్.!

- March 14, 2023 , by Maagulf
వినూత్నంగా ‘విరూపాక్ష’ ప్రమోషన్స్.!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత ‘విరూపాక్ష’ సినిమాతో రాబోతున్నాడు. యాక్సిడెంట్ తర్వాత తేజు నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సుకుమార్ అందించిన కథతో కొత్త దర్శకుడు కార్తీక్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

మూఢ నమ్మకాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్ని స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

తాజాగా ‘అక్షరాల వెనకున్న అంకెలు.. ఆ అంకెలే ఈ కథకి ఆరంభం’ ఈ పజిల్‌ని డీ కోడ్ చేయండి.. అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ పజిల్ డీ కోడ్ చేస్తే ఏమొస్తుంది.? బహుశా సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్ అవుతుందేమో అంటూ చర్చ జరుగుతోంది.

ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయ్. ఇకపై రిలీజ్ కానున్న ఈ సినిమా అప్‌డేట్స్ సినిమాపై ఇంకెలాంటి ఆసక్తిని రేకెత్తిస్తాయో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com