నాగశౌర్య ఈ సారేం చేస్తాడో.!

- March 14, 2023 , by Maagulf
నాగశౌర్య ఈ సారేం చేస్తాడో.!

అర్జెంటుగా హిట్ పడాల్సిన కుర్ర హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఈ మధ్య కాలంలో నాగ శౌర్యకు ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘వరుడు కావలెను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కానీ, ఆశించిన రిజల్ట్ అందుకోలేదా సినిమా.

తాజాగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాతో రాబోతున్నాడు. మార్చి 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘కళ్యాణ వైభోగమే’ కాంబినేషన్ మాళవికా నాయర్‌తో నాగశౌర్య జత కట్టాడు ఈ సినిమా కోసం. 

టైమింగ్ వున్న నటుడు, రచయిత, దర్శకుడు అయిన శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాని తెరకెక్కించాడు. సో, సినిమాపై ఒకింత అంచనాలున్నాయ్. కూల్ అండ్ లవ్లీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వుండబోతోందన్న నమ్మకం ఒకింత ప్రేక్షకుల్లో నెలకొంది. 
ఏమో.! ఈ సారైనా నాగ శౌర్యకు హిట్టు కట్టబెడతారో లేదో ప్రేక్షక దేవుళ్లు చూడాలి మరి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com