ఆర్థిక,విదేశాంగ విధానలపై తాలిబన్లకు భారత్‌ ఆన్‌లైన్ పాఠాలు..

- March 15, 2023 , by Maagulf
ఆర్థిక,విదేశాంగ విధానలపై తాలిబన్లకు భారత్‌ ఆన్‌లైన్ పాఠాలు..

తాలిబన్: తాలిబన్లకు భారత్ ఆర్థిక పాఠాలు చెప్పనుంది. నాలుగు రోజుల పాటు ఆన్ లైన్ వేదికంగా అఫ్ఘానిస్థాన్ ని స్వాధీనం చేసుకుని పాలన చేపట్టిన అధికారులకు భారత్ ఆర్థిక, విదేశాంగ విధానాలపై పాఠాలు చెప్పనుంది. ఆన్ లైన్ వేదికగా జరిగే ఈ పాఠాలకు పలువురు తాలిబన్ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారరత విదేశాంగశాఖ తెలిపింది. నాలుగు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమానికి తాలిబన్ దౌత్యవేత్తలు హాజరు అవుతారని అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కాగా అఫ్ఘానిస్థాన్ నుంచి తాలిబన్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై పలువురు భారత్‌ వైఖరిపై సందేహాలు వ్యక్తం చేశారు. కానీ తాలిబన్లు భారత్ రావటంలేదు. ఆన్ లైన్ వేదికగానే ఈ పాఠాల కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఎటువంటి సందేహాలు అవసరం లేదని భారత్ కు చెందిన ఓ అధికారి తెలిపారు.

కాగా అఫ్ఘానిస్థాన్ ను స్వాధీనం చేసుకుని పాలన కొనసాగిస్తున్నారు తాలిబన్లు. ఈ క్రమంలో తాలిబన్ల విధించే ఆంక్షలకు ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళల పట్ల తాలిబన్లు విధించిన ఆంక్షలు అన్నీ ఇన్నికావు. ఈ ఆంక్షలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అఫ్ఘానిస్థాన్ కు నిధులు కొరత ఏర్పాడింది. దీంతో ఏర్పడిన సంక్షోభానాకి అఫ్ఘాన్ ప్రజలు ఆకలితో అల్లాడిపోయే పరిస్థితికి దిగజారింది దేశం. దీంతో అఫ్ఘాన్ ప్రజలు కన్నబిడ్డలను కూడా అమ్ముకునే దుస్థితికి దిగజారారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ పెద్ద మనస్సుతో స్పందించింది. అఫ్ఘాన్ ప్రజలకు గోధువులను పంపించింది. పాకిస్థాన్ మీదుగా గోధుమలను లారీల ద్వారా తరలించింది.ఇలా తాలిబన్ల ఆకలి తీర్చటంలో భారత్ చొరవను తాలిబన్లు కూడా అర్థం చేసుకున్నారు. భారత్ చేసింది మంచి సహాయం అని పేర్కొన్నారు.

ఇదిలా ఇండియన్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ (ITEC) కార్యక్రమంలో భాగంగా ఇండియన్‌ ఇమ్మెర్షన్‌ అనే కోర్సును భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఐఐఎమ్‌ కోలికోడ్‌ నిర్వహిస్తోంది. మార్చి 14 నుంచి మార్చి 17 వరకు ఈ కార్యక్రమం ఆన్‌లైన్‌ వేదికగా జరగనుంది. ఇందులో అఫ్ఘానిస్థాన్‌ నుంచి దాదాపు 18మంది తాలిబన్ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అఫ్ఘానీయులకు భారతీయ వ్యాపారం,పర్యావరణం, సామాజిక వెనుకబాటు, నాయకత్వం, నియంత్రణ పర్యావరణ వ్యవస్థ,వ్యాపార నిర్వహణలో కలిగే నష్టాలు వంటి అంశాల గురించి భారత్ లోతైన అవగాహన కల్పించనుంది. ఈ కార్యక్రమంలో భారత్ కు చెందిన ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులుతో కలిపి సుమారు 30మంది వరకు పాల్గొనవచ్చు.

తాలిబన్లకు కల్పించే అవగాహన కార్యక్రమం పూర్తిగా ఆలన్ లైన్ కోర్సు కావటంతో తాలిబన్లు భారత్‌కు రావాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి భారత్ తాలిబన్లకు నిర్వహించే ఈ కార్యక్రమంపై ఎటువంటి భయాందోళనలు గానీ అనుమానాలు గానీ పెట్టుకోవాల్సిన అసవరం లేదని భారత్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కోర్సు ద్వారా తాలిబన్లకు ఆర్థిక, విదేశాంగ విధానలపై పూర్తి అవగాహన కల్పించవచ్చని భారత్‌ భావిస్తోంది.

కాగా.. 2021 ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగిన తర్వాత అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో తిరిగి తాలిబన్లతో నరకం అనుభవించాల్సి వస్తుందనే భయంతో ఎంతోమంది దేశం వదిలిపోయారు. దేశాన్ని చేజిక్కించుకున్నాక తాలిబన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమదైనశైలిలో నియంత పాలన కొనసాగిస్తున్నారు. దీంతో దేశం అంతా అరాచక వాతావరణం ఏర్పడింది. ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుని ప్రజలకు తినటానికి తిండికూడా లేక ఇంట్లో వస్తువులతో పాటు కన్నబిడ్డలను కూడా అంగడి సరుకుల్లా అమ్ముకోవాల్సి వచ్చింది. తాలిబన్ల దాడులు కొనసాగుతున్న క్రమంలో అప్ఘానిస్థాన్ లోభారత్ సహా ప్రపంచ దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేశాయి.

ఈ క్రమంలో వాతావరణం కాస్త సద్దుమణిగాక 2022 జులైలో భారత్ కాబూల్‌లోని రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది. సాంకేతిక బృందం గా పిలిచే రాయబార కార్యాలయం సిబ్బంది.. అఫ్ఘాన్ ప్రజలకు భారత్ అందజేస్తోన్న మానవతా సాయాన్ని పర్యవేక్షిస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. అప్ఘాన్ పరిస్థితిని అర్థం చేసుకున్న భారత్ ఆహార సహాయం అందించింది. ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమంలో భాగంగా భారత్‌ 50 వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను అఫ్గానిస్థాన్‌కు సాయంగా అందిస్తామని ప్రకటించింది. దీంట్లోభాగంగా ఇప్పటికే 20 వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను పంపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com