రమదాన్: గృహ కార్మికుల నియామకంపై మంత్రిత్వ శాఖ కీలక సూచనలు

- March 15, 2023 , by Maagulf
రమదాన్: గృహ కార్మికుల నియామకంపై మంత్రిత్వ శాఖ కీలక సూచనలు

దుబాయ్: రమదాన్ మాసం సమీపిస్తున్న కొద్దీ గృహ కార్మికుల ఉపాధి కోసం డిమాండ్ పెరుగుతోంది. దీంతో కార్మికులను నియమించుకోవడానికి ఎలాంటి విశ్వసనీయత లేని సోషల్ మీడియా ప్రకటనలను అనుసరించవద్దని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) పిలుపునిచ్చింది. మంత్రిత్వ శాఖ ఆమోదించిన గృహ కార్మికుల నియామక ఏజెన్సీలతో ద్వారా గృహ కార్మికులను నియమించుకోవాలని సూచించింది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా గృహ కార్మికులను ప్రోత్సహించే ఏజెన్సీల విశ్వసనీయతను ధృవీకరించడానికి 600590000 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.  దేశవ్యాప్తంగా మంత్రిత్వ శాఖ ఆమోదించిన 80 గృహ కార్మికుల నియామక కార్యాలయాలు ఉన్నాయని, వాటి వివరాలు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. ఈ కార్యాలయాలు 15 డిసెంబర్ 2022 నుండి అమల్లోకి వచ్చిన గృహ కార్మికులకు సంబంధించి 2022 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ (9)కి అనుగుణంగా పని చేస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మంత్రిత్వ శాఖ ఆమోదించబడిన కార్యాలయాలు "సాంప్రదాయ ప్యాకేజీ"ని అందిస్తాయి. దీనిలో కార్మికుడు, యజమాని పేర్లను నమోదు చేస్తారు. రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధి ఉంటుంది. ఈ కాలంలో  ఏజెన్సీ గృహ కార్మికుడికి ఉపాధి హామీ ఇస్తుంది. ఏదైనా ఒప్పందం మొదటి ఆరు నెలల్లో (ట్రయల్ పీరియడ్) లో సమస్యలు తలెత్తిన పక్షంలో రిక్రూట్‌మెంట్ ఖర్చులను తిరిగి పొందవచ్చు. చట్టబద్ధమైన కారణం లేకుండా కార్మికుడు ఒప్పందాన్ని ముగించడం లేదా ఆమోదయోగ్యమైన కారణం లేకుండా పనిని విడిచిపెట్టడం లేదా కార్మికుడు పాత్రకు అనర్హుడని లేదా కార్మికుడు అవసరమైన, అంగీకరించిన విధంగా పని పనులను చేయలేకపోవడం వంటివి ఒప్పందంలో ఉంటాయి.   

ఒకవేళ ట్రయల్ వ్యవధి తర్వాత కార్మికుడు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే లేదా ఆమోదయోగ్యమైన లేదా చట్టబద్ధమైన కారణం లేకుండా పనిని వదిలివేసినట్లయితే, రిక్రూట్‌మెంట్ ఖర్చులలో కొంత భాగం కాంట్రాక్టు ముగింపు తేదీ వరకు పోస్ట్-ట్రయల్ వ్యవధిలో యజమానులు తిరిగి పొందవచ్చు. అయితే, ఈ మొత్తం రెండు సంవత్సరాల కాంట్రాక్టు వ్యవధి నుండి మిగిలిన నెలల ప్రకారం మొత్తం రిక్రూట్‌మెంట్ ఖర్చు నుండి లెక్కించబడుతుంది.

మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ కూడా తమ గృహ కార్మికులను వేతన రక్షణ వ్యవస్థ (WPS)లో నమోదు చేసుకోవాలని యజమానులకు పిలుపునిచ్చింది. వ్యవస్థలో నమోదు చేసుకోవడం ద్వారా అన్ని వృత్తుల్లో పనిచేసే గృహ కార్మికుల వేతనాలు చెల్లించడం యజమానులకు అందుబాటులో ఉన్న ఎంపిక అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏప్రిల్ 1 నుండి, ఈ సిస్టమ్‌లో ఐదు వృత్తులు(ప్రైవేట్ వ్యవసాయ ఇంజనీర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO), హౌస్‌కీపర్, పర్సనల్ ట్యూటర్, పర్సనల్ ట్రైనర్) తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనని మంత్రిత్వ శాఖ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com